నవభారత నిర్మాణానికి నాంది: మోడీ

281
modi

నవంబర్ 9 చారిత్రాత్మకమైన రోజు అని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అయోధ్య తీర్పు నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మోడీ…భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నారు. భారత న్యాయ వ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుతున్నాయని…అయోధ్యపై సుప్రీం మహోన్నత తీర్పును వెలువరించిందన్నారు.

అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమైనదని అన్నారు. నూతన భారత్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది అని..దశాబ్దాలుగా వస్తున్న వివాదానికి నేటి తీర్పుతో శాశ్వతంగా తెరపడిందని మోడీ తెలిపారు. కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని, ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిపోయిందని అన్నారు.