కొరియన్ కనకరాజు..బ్లాక్‌బస్టర్

1
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ గాంధీ, నేను ఈ సినిమాకు ఫ్రెండ్స్‌లా కలిసి పనిచేశాం. అదే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఒక కారణమని అనుకుంటున్నాను. మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. మా నిర్మాతలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మా విజన్ ని సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. మా కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరికీ పేరుపేరునా బిగ్ థ్యాంక్స్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమాకు బిగ్ పిల్లర్. మురళీధర్ గౌడ్ గారు, సునీల్ అన్న, రేవంత్ ఇలా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రితిక మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. సత్య ఈ సినిమాతో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా డెడికేషన్ ఉన్న యాక్టర్. చిరంజీవి గారు చెప్పినట్టు ఈ సినిమాకు తను బిగ్గెస్ట్ ఎసెట్. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన నా భార్య లావణ్యకు చాలా థ్యాంక్స్. మా అమ్మ, నాన్నతో పాటు ప్రతి ఒక్కరికీ థాంక్యూ. మా పెదనాన్న చిరంజీవి గారిని చూసి పెరిగాను. ఆయనే నా ఇన్‌స్పిరేషన్. ఒక సినిమా హిట్ కొట్టిన తర్వాతే పిలుద్దాం అనుకున్నాను. ఈ సినిమా సక్సెస్ కావడం, చిరంజీవి గారు వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. పెదనాన్న, నాన్న, బాబాయ్ ఎప్పుడూ ఒకే మాట చెప్తారు. నమ్మిన పనిని నిజాయితీగా చేయమని చెబుతుంటారు. మాకు మంచి మాటలు చెప్పి పెంచారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ. అలాగే సినిమాను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడికి థాంక్స్. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. మీ అందరికీ మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉంటాను. మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. మంచి క్యారెక్టర్స్ చేస్తాను. మిమ్మల్ని అలరిస్తాను. మీ సపోర్ట్‌కి థాంక్యూ సో మచ్. మంచి స్క్రిప్ట్ కుదిరితే ఈ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం.

సత్య మాట్లాడుతూ: నేను యాక్టర్ అవ్వాలని నిర్ణయం వైజాగ్‌లోనే తీసుకున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా గాంధీ గారికి థాంక్యూ. అలాగే అందరికీ థాంక్యూ. వరుణ్ తేజ్ గారు ఎప్పటికప్పుడు చాలా కొత్త కథలు, పాత్రలు చేస్తుంటారు. ఒక మెగా ఫ్యాన్‌గా ఆయన ఇలాగే కొత్త తరహా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ జర్నీలో ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే మా కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్‌అవుట్ అయింది. మెగాస్టార్ గారంటే నాకు పిచ్చి. ఆయనతో పనిచేసినప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్ మాటలు చెప్పారు. అవి ఎప్పుడూ నా మనసులో ఉంటాయి. అందరికీ థాంక్యూ.

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ: కొరియన్ కనకరాజు’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాను నేను ప్రత్యేకంగా చూశాను. ఒకపక్క వినోదం, మరోపక్క గ్యాంగ్‌స్టర్ రోల్.. ఈ రెండు పాత్రలను వరుణ్ తేజ్ గారు అద్భుతంగా పోషించారు. అలాగే సత్య గారి పాత్ర కూడా అద్భుతంగా వచ్చింది. రితిక నాయక్ కూడా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు అద్భుతంగా సినిమా తీయడంతో పాటు చాలా చక్కని స్క్రీన్‌ప్లే రాశారు. ఇది వరుణ్ తేజ్ గారి కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలబడుతుంది. అలాగే ప్రజాదరణ పొందిన సినిమాగా కూడా నిలిచింది. ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ అభినందనలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. అవసరమైన మేరకు అన్ని అనుమతులు, స్థలాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మౌలిక సదుపాయాలు కావాలి. దానికి అందరం కలిసి కృషి చేద్దామని మనవి చేసుకుంటున్నాను.”

డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. ఆడియన్స్‌లో ఇంత ఎనర్జీ, నవ్వులు చూస్తుంటే మేం పడిన కష్టమంతా మర్చిపోయాం. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడే మేము పడి పడి నవ్వాం. అవే నవ్వులు ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తున్నాయి. వరుణ్ ప్రతి పాత్రకు చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతారు. ‘కనకరాజు’ పాత్రకు కూడా తనదైన యాటిట్యూడ్ తీసుకొచ్చారు. హ్యాట్సాఫ్ వరుణ్. తను ఇలాగే గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సత్య ఈ సినిమాకు మరో పెద్ద అసెట్. ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇంత పెద్ద విజయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ: మేము మెగాస్టార్ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. మాకు మెగా కుటుంబం అంటే చాలా అభిమానం. నిన్న ఈ సినిమాను మేమందరం ఫ్యామిలీతో కలిసి చూశాం. సినిమాలో చాలా ఆస్వాదించాం. ఇంత చక్కటి విజయం అందుకున్న టీమ్‌ అందరికీ అభినందనలు. వరుణ్ తేజ్ మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని, మరెన్నో గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.”

Also Read:Dharman:పవర్‌ఫుల్ డాక్టర్‌గా రజనీ

ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ‘కొరియన్ కనకరాజు’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్‌కి అభినందనలు. టీమ్‌ అందరికీ కంగ్రాట్యులేషన్స్. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. రానున్న కాలంలో మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను.

ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మెగా హీరోలందరూ అందరూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. భవిష్యత్తులో వరుణ్ తేజ్ గారికి మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా యూనిట్‌ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుక చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -