మీ గుండె ఆరోగ్యంగా పనిచేస్తోందా?

7
- Advertisement -

మన గుండె నిరంతరం, ఎప్పుడూ ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. సాధారణంగా గుండెకు సంబంధించిన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాం. కానీ గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం కూడా అంతే ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన గుండెకు ముఖ్యమైన సంకేతం స్థిరమైన విశ్రాంతి హార్ట్ రేట్. పెద్దవారిలో ఇది సాధారణంగా నిమిషానికి 60 నుంచి 100 బీట్‌ల మధ్య ఉంటుంది. వ్యాయామం చేసే వారికి ఇది ఇంకా తక్కువగా ఉండవచ్చు. హార్ట్ బీట్ సరిగా ఉండటం రక్తప్రసరణ బాగుందని సూచిస్తుంది.

సుమారు 120/80 mm Hg వద్ద ఉండే రక్తపోటు గుండె ఆరోగ్యానికి మంచి సూచిక. ఇది గుండె ఎలాంటి ఒత్తిడి లేకుండా సరిగ్గా పనిచేస్తోందని సూచిస్తుంది.గుండె బలంగా ఉంటే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. దీంతో మీకు రోజువారీ పనులు, వ్యాయామం అలసట లేకుండా చేయగలిగితే అది గుండె ఆరోగ్యంగా ఉందని సూచిస్తుంది.

వ్యాయామం తర్వాత హార్ట్ రేట్ త్వరగా సాధారణ స్థాయికి రావడం గుండె బలం ఉన్నదని తెలియజేస్తుంది. ఆలస్యంగా సాధారణ స్థితికి వస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యకరమైన గుండె సాధారణంగా ఎలాంటి అసౌకర్యం కలిగించదు. ఛాతి నొప్పి, బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకపోవడం మంచి సంకేతం.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

సమతుల్య ఆహారం తీసుకోవాలి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
ఒత్తిడిని తగ్గించాలి
సరిపడ నిద్రపోవాలి
పొగ త్రాగడం మానుకోవాలి

- Advertisement -