ఆ భామ పై కొరటాల చూపు

32
- Advertisement -

రీసెంట్ గా ధమాకా తో సందడి చేసిన కుర్ర భామ శ్రీలీల.. ఏకంగా ఎన్టీఆర్ తో కలిసి రొమాన్స్ చేయబోతుంది అంటూ టాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ కన్నడ భామ తాజాగా కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో చాన్స్ కొట్టేసిందని ఆ వార్తల సారాంశం. దీంతో నక్క తోక తొక్కిన శ్రీలీల అంటూ నెటిజన్లు అమ్మడిని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వార్తలో అసలు వాస్తవం ఉందా ?, కొరటాల శివ – ఎన్టీఆర్ కోసం రాసిన కథలో అయితే సెకండ్ హీరోయిన్‌ కి స్కోప్ ఉంది.

ఆ సెకండ్ లీడ్ గానే జాన్వీ కపూర్ ను లేదా అనన్య పాండేను పెట్టుకుంటున్నారు అంటూ ఆ మధ్య పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. ప్రస్తుతం శ్రీలీల పేరు వినిపిస్తోంది. రవితేజతో ధమాకాలో నటించిన ఈ బ్యూటీకి నిజంగానే ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ వస్తే అమ్మడు దశ తిరిగినట్టే. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా పాన్ ఇండియా సినిమాగా వస్తోంది.

కాబట్టి.. భవిష్యత్తులో మార్కెట్ పరంగా చూసుకున్నా.. శ్రీలీలకు మార్కెట్ క్రియేట్ అవుతుంది. మరి ఈ లెక్కన ఎన్టీఆర్ సినిమాతో శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. ఇప్పటికే శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. పైగా కన్నడంలో కూడా శ్రీలీలకి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్యకి కూతురిగా కూడా నటిస్తుంది. మొత్తానికి ఈ కుర్ర భామ పై ఇప్పుడు కొరటాల శివ చూపు కూడా పడింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -