మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఈ మూవీలో కొత్త లుక్ కోసం బరువు కూడా తగ్గాడు చిరు.
ఇక అసలు విషయానికొస్తే మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవడం…విడుదలకు సిద్ధంగా ఉండటం ఆశ్చర్యమనిపించిందన్నారు. ప్రస్తుతం సినిమాల షూటింగ్ చాలా రోజుల పాటు జరుగుతుందని…ఫలితంగా డబ్బు వృధా అవడమే కాకుండా హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేయాల్సి వస్తుందన్నారు.
అయితే ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా కూడా 99 రోజుల్లో పూర్తిచేయాలని దర్శకుడు కొరటాల శివ దగ్గరి నుంచి మాట తీసుకున్నారు చిరంజీవి. అంటే మూడు నెలల్లోనే చిరు సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. మరి చిరు అంచనాలను నిజం చేస్తూ అనుకున్న సమయంలోనే సినిమా షూటింగ్‌ను కొరటాల పూర్తిచేస్తాడా లేదా అన్న సస్పెన్స్ ఇప్పుడు అందరిలో నెలకొంది.