జెఎన్‌యు సబర్మతి హాస్టల్ వార్డెన్ రాజీనామా..!

438
jnu
- Advertisement -

జెఎన్‌యులో సబర్మతి హాస్టల్ సీనియర్ వార్డెన్ ఆర్. మీనా రాజీనామా చేశారు. ఆదివారం ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో సుమారు 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకున్న ప్రొఫెసర్లపై కూడా దాడులు చేశారు దుండగులు.

jnu_attack

అయితే తాము పరిస్థితులును కంట్రోల్ చేసేందుకు ప్రయతించినప్పటికి ,హాస్టల్‌కు భద్రత కల్పించలేకపోయామని సబర్మతి హాస్టల్‌ వార్డెన్‌ ఆర్‌. మీనా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు స్టూడెంట్‌ డీన్‌కు ఆమె తెలిపారు. తన రాజీనామా లేఖను యూనివర్సిటీ అధికారులకు పంపారు.

- Advertisement -