తీవ్ర ఒత్తిడిలో దర్శకుడు ఆరాటం

24
- Advertisement -

టాప్ డైరెక్టర్ గా పేరొందిన కొరటాల శివ దూకుడుకి మెగాస్టార్ చిరంజీవి – చరణ్ కలయికలో వచ్చిన ఆచార్యతో కొంత బ్రేక్ పడింది. ఆ సినిమా కథ, కథనాల విషయంలో కొరటాల శివ విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో, కొరటాల శివ తదుపరి చిత్రం దేవర విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముఖ్యంగా “గ్యాసిప్” గ్యాంగ్ ఒకటి చాలా వార్తలు వండి వార్చింది. దేవర స్క్రిప్ట్ విషయంలో కూడా కొరటాల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు అని, ఇప్పటికీ కొరటాల శివ దేవర స్క్రిప్ట్ పై నిత్యం వర్క్ చేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది.

నిజానికి, ఆచార్య రిజల్ట్ తర్వాత స్టార్ హీరోలు, కొరటాల శివని దూరం పెట్టారని, “ఆచార్య” తర్వాత కొరటాల శివ తో చేద్దామని అనుకున్న సినిమాని అల్లు అర్జున్ పక్కన పెట్టేశాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవి పట్టించుకోకుండా తన తదుపరి చిత్రం కోసం పని మొదలు పెట్టి, చివరకు ఎన్టీఆర్ ను ఒప్పించాడు. ఎన్టీఆర్ కూడా ప్లాప్ తో సంబంధం లేకుండా కొరటాల శివకి ఛాన్స్ ఇచ్చాడు. ఏది ఏమైనా కొరటాల శివ ఈ సారి బాగా కసి మీద ఉన్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఆరాట పడుతున్నాడు.

గత సినిమా ఆచార్య ప్లాప్ కారణంగా.. కొరటాల శివలో బాగా పట్టుదల పెరిగింది. ఎలాగైనా దేవర సినిమాని అద్భుతమైన హిట్ సినిమాగా మలచాలి అని కొరటాల శివ ఫిక్స్ అయ్యాడు. మరి ఆ రేంజ్ విజయాన్ని కొరటాల శివ సాధిస్తాడో లేదో చూడాలి. పైగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఇలా మొత్తం యూనిట్ కష్టపడుతుంది.

Also Read:ప‌న‌స పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా?

- Advertisement -