ఏ పార్టీని, నాయకుడిని లక్ష్యం చేసుకోలేదు !

157
Koratala Shiva clarifies Mahesh role in his movie
- Advertisement -

బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఇప్పడు అదే స్పీడుతో మహేశ్ బాబు.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీలో ఓ సీఎం ట్రేడ్ మార్క్ గెడ్డంను రిఫరెన్స్‌గా తీసుకుని ఆ విధంగా కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ‘భరత్ అను నేను’ పేరిట రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని.. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నాడని .. పైగా ఈ చిత్రం సమకాలీన రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తుందని వార్తలొస్తున్నాయి.

Koratala siva

ఈ నేపథ్యంలో దర్శకుడు శివ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీయడం లేదని ఆయన చెప్పాడు. అలాగే, ఇందులో మహేశ్ పోషిస్తున్న పాత్ర ఏ రాజకీయ నాయకుడినీ పోలి ఉండదని తెలిపాడు. ఇక ఇందులో ఎటువంటి వ్యంగ్య సంభాషణలు ఉండవని దర్శకుడు తేల్చిచెప్పాడు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

- Advertisement -