అందుకే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌కి వెళ్లలేదు!

31
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డును సైతం దక్కించుకుంది. అయితే ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు నిర్మాత డీవీవీ దానయ్య.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళికి 2006 లోనే సినిమాకు అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తర్వాత మర్యాద రామన్న నాతో తీస్తాను అన్నాడు. నేనే పెద్ద సినిమా చేద్దామన్నాను. ఆ తర్వాత రాజమౌళి వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ నేను ఇచ్చిన అడ్వాన్స్ గుర్తుంచుకొని, నాకు మాట ఇచ్చాడని నా కోసం RRR లాంటి భారీ సినిమా చేశాడని తెలిపారు.

ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి సినిమా తీసి నాకు సక్సెస్ ఇచ్చాడు. ఆయన కమిట్మెంట్ అలాంటిదని కొనియాడారు.ఆర్ఆర్ఆర్ సినిమా ఫలితంపై నేను చాలా సంతృప్తిగానే ఉన్నాను. కొంతమంది ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. అవన్నీ అబద్దాలు అని తెలిపారు. తనకు పబ్లిసిటీ నచ్చదని అందుకే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి వెళ్ళలేదు. ఆస్కార్ ప్రమోషన్స్ కి డబ్బులు ఖర్చు అయ్యాయని అంటున్నారు. నేనైతే డబ్బులు పెట్టలేదు, రాజమౌళినే పెట్టుకున్నాడు అనుకుంట అని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -