ఛార్మీ కోసం తెగ ట్రై చేస్తున్నాడు..

490

పూరి- ఛార్మి అనుబంధంపై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ వ‌ల్ల పూరి ఫ్యామిలీలో క‌ల‌త‌లు వ‌చ్చాయ‌న్న వార్త‌లు కూడా గుప్పుమన్నాయి.

అయితే వాటిని పూరి ఆ త‌ర్వాత ఖండించారు కూడా. ఇక పూరి క‌నెక్ట్స్ పేరుతో కాస్టింగ్ సెలెక్ష‌న్ నుంచి పూరి వ్యాపారాల్లో ఛార్మి భాగ‌స్వామిగా కొన‌సాగుతున్నార‌న్న వార్తలు వ‌చ్చాయి.

Puri Jagannadh,SIT,Charmee Kaur Puri Supports Charmee Kaur ...

వీట‌న్నిటి నేప‌థ్యంలో డ్ర‌గ్స్ లింకుల్లో పూరి-ఛార్మి పేర్లు క‌నిపించ‌డం.. అటుపై సిట్ విచార‌ణ సాగుతున్న నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రిపైనా మ‌రిన్ని ఘాటైన వార్త‌ల్ని ప‌లు వెబ్ మీడియాలు ప్ర‌చురించాయి. అయితే దీనిపై పూరి చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు క‌థానాయిక ఛార్మి కెరీర్‌ని డ్యామేజ్ చేసేలా ఆ క‌థ‌నాలు ఉన్నాయ‌ని పూరి ఖండించినట్టు సమాచారం.

హీరోయిన్‌ ఛార్మి ఆ స్థాయికి ఎదిగేందుకు ఎంతో శ్ర‌మించిందని, త‌నో డీసెంట్ ఉమెన్‌ అని, త‌నపై మీడియా అన‌వ‌స‌ర ప్ర‌చారానికి దిగుతోందని పూరి అన్నట్టు తెలుస్తోంది. ఇక డ్ర‌గ్స్‌తో కానీ, కెల్విన్‌తో కానీ ఛార్మికి ఎటువంటి సంబంధాలు లేవ‌ని చార్మీ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పూరి ప్ర‌య‌త్నించార‌ని అంతేకాకుండా ఛార్మి వ్య‌క్తిత్వంపై సిట్‌కి పూరి క్లీన్‌చిట్ ఇచ్చార‌ని చెప్పుకుంటున్నారు.