అంబేద్కర్ జయంతి..రాష్ట్ర ప్రజలకు కొప్పుల విజ్ఞప్తి

404
Koppula Eshwar
- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాత, “భారతరత్న” డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరు ఇంటివద్ద నుండే ఆ మహానుభావునికి నివాళులు అర్పించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఈ పాటికే ఆదేశాలు జారీ చేసినందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటి వద్దే ప్రజలు ఘనంగా ఆ మహానుభావునికి నివాళులు అర్పించాలన్నారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు. గుంపులుగా గుమికూడవద్దన్నారు. కరోనా కట్టడిలో మన దేశం తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మెచ్చుకుంది. కావున ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటించి ఆ మహనీయుని జన్మదిన వేడుకలు నిర్వహించడమే ఆ నాయకునికిచ్చే ఘన నివాళి అన్నారు.

- Advertisement -