నిట్‌లో సత్తా చాటిన విద్యార్థులను అభినందించిన మంత్రి కొప్పుల..

274
- Advertisement -

దేశ వ్యాప్తంగా నిట్ ప్రవేశ పరీక్షలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల నుండి 150 మంది విద్యార్థులు ఎంపిక కావడంతో రాజేంద్ర నగర్‌లోని ఐఐటి స్టడీ సర్కిల్‌లో విద్యార్థుల అభినందన సభకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ పలువురు విద్యార్థులను అభినందిస్తూ సన్మానించారు.

Minister for Welfare Koppula Eshwar

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..ఈ రోజు మన తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యలయాలలో చదువుతున్నపేద విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించిన నిట్ ప్రవేశ పరీక్షలో పెద్ద ఎత్తున క్వాలిఫై అయిన ప్రతి ఒక్క విద్యార్థిని అభినందిస్తున్నాను అన్నారు. తెలంగాణ రాక ముందు 2012 ఎంత కష్ట పడ్డ 15 మందికి మించి రాలేదు.. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాలకు ధీటుగా 150 మంది నిట్‌లో ప్రవేశ పొందడం మన అందరి అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఆయనే మన ధైర్యం అన్నారు.

ఈ కష్టాల వెనుక గొప్ప ప్రయత్నం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సరైన అధికారులను నియమించి మంచి వసతులు కల్పించి బీడీ, కూలి, ఇతర పనులు చేసుకుంటున్న తల్లిదండ్రుల పిల్లలు అందరూ ఈరోజు మెడికల్, డెంటల్లలో సిట్లు సంపాదించడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ, ప్రోత్సహిస్తూ మరో ఇరవై ఏండ్లు కూడా మన ప్రభుత్వమే ఉంటుందని మంత్రి తెలిపారు.

- Advertisement -