ఈ నేల చరిత్రలో నిలిచిపోతుంది.

395
- Advertisement -

మొన్నటి వరకూ ఆ గ్రామం పేరు కూడా తలుచుకున్నది లేదు. అనుకోకుండా ఆ గ్రామానికి వెళితే…టక్కున పేరు గుర్తురావడాని అంత పాపులర్‌ గ్రామమూ కాదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం ఆ గ్రామం పేరే తలుచుకుంటోంది. ఆ గ్రామం పేరే కొంగరకలాన్‌. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామం ఇది.

    Kongara Kalan makes history పేరు కూడా గుర్తురాని ఈ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోవడనికి కారణం తెలంగాణ ప్రభుత్వం. అందుకే …మా ఊరికి ఇంత గుర్తింపు తెచ్చినందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రుణపడి ఉంటామంటూ.. ఆ గ్రామప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భారతరాజకీయ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ‘ప్రగతి నివేదన సభ’ను నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు సీఎం కేసీఆర్. ఆ సభను నిర్వహించేందుకు కొంగరకలాన్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అందుకు తగ్గట్టుగానే…సెప్టెంబర్ 2న, 25 లక్షల మందితో జరగనున్న ఈ భారీ బహింరంగ సభను విజయవంతం చేయడానికి తెలంగాణ ప్రజలు నడుంబిగించారు.

  Kongara Kalan makes history

రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని ప్రతీ గల్లీ నుంచి తెలంగాణలో జాతరను తలపించే విధంగా తరలి వస్తున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకనుంచి ‘కొంగరకలాన్‌’ అంటూ..నినాదాలు చేసుకుంటూ సభాప్రాంగణానికి అడుగులేస్తున్నారు. ఇప్పుడు కొంగరకలాన్‌ పేరు తెలంగాణ ప్రజల గొంతుకలో నానడమేకాకుండా… అద్దంలా మెరిసిపోతున్న రహదారులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రావిర్యాల నుంచి స్మార్ట్ జీనియస్ మోడల్ స్కూల్ వరకూ మూడు కిలోమీటర్ల దూరం సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా అభివృద్ధి చెందింది. బీటీ రోడ్డుగా 60 ఫీట్ల రహదారిగా నిర్మించారు. ఇంతటి అభివృద్ధిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు తమ పల్లెకు ఇంత పేరును తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందుకే కొంగరకలాన్‌ నేల ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మారుమోగిపోతోంది.

    Kongara Kalan makes history

కొంగరకలాన్‌ గ్రామం వివరాలు : హైదరాబాద్‌కు 20 కిలోమీటర్లు, బొంగులూర్ ఔటర్ రింగు రోడ్డుకు నాలుగు, ఆదిబట్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. కొంగకలాన్‌లో మొత్తం 5,269 మంది జనాభా ఉంది. వీరిలో పురుషులు 2,737 మంది కాగా, మహిళలు 2,532 మంది ఉన్నారు. వ్యవసాయ భూములు 4, 312 ఎకరాలు, ఫారెస్టు భూములు 790 ఎకరాలు ఉన్నాయి. ఇటీవల ఆదిబట్ల మున్సిపాలిటీలో కొంగరకలాన్‌ను వీలినం చేశారు. కాగా..సెప్టెంబర్‌ ఆదివారం కొంగరకలాన్ గ్రామంలో పోచమ్మ బోనాలు జరుగాల్సి ఉన్నది.

అయితే సభ కోసం ప్రజలు ఉత్సవాలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకున్నారు. ప్రగతి నివేదన పూర్తయిన తర్వాతే బోనాలను సంబురంగా జరుపుకుంటామని గ్రామస్తులు చెప్పారు. అన్నట్టు…ఈ ‘భారీ భహిరంగ సభ’ దేశచరిత్రలో నిలిచిపోయినా..లేకపోయినా..కొంగరకలాన్‌ ప్రాంతం మాత్రం కేసీఆర్‌ మనసులో ఓ తీపి గుర్తుగా ఎప్పటికీ మెదులుతూనే ఉంటుంది.

- Advertisement -