దూసుకుపోతున్న నాగ్‌-నానీల సాంగ్..

225

నాగార్జున, నాని కథానాయకులుగా నటిస్తున్న సినిమా ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు వ్యవహరిస్తున్న ఈ మూవీలో రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనిదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరికే విడుదలైన ఫస్ట్‌లుక్‌,టీజర్‌కి మంచి రెస్సాన్స్‌ వచ్చింది. ఇక గత బుధవారం నాగార్జున పుట్టినరోజు కాగా గురువారం ఈ సినిమాలోని ‘వారూ వీరూ..’ అని సాగే పాటను విడుదల చేశారు.

Devadas Vaaru Veeru Song

ఇందులో నాగ్‌-ఆకాంక్ష, నాని-రష్మిక జంటల మధ్య ప్రేమను చూపించారు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. అనురాగ్‌ కులకర్ణి, అంజనా సౌమ్య పాటను ఆలపించారు. అయితే వినసొంపుగా ఉన్న ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ పాటను 12 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం.

అంతేకాదు పాట నచ్చిందని 28 వేల మంది లైక్‌ చేశారు. ఈ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 11వ స్థానంలో ఉంది. మణిశర్మ బాణీలు అందించిన ఈ సినిమ సెప్టెంబరు 27న ఈ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Vaaru Veeru Lyrical || Devadas Songs || Akkineni Nagarjuna, Nani, Rashmika, Aakanksha Singh