కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

5
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్నటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు.

గతేడాది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కోనప్ప . 2004లో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 2014లో బీఎస్పీ నుండి, 2018 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్(BRS) మ‌ళ్లీ గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు అయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఏడాది పూర్తికాకముందే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Also Read:LRS పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్!

 

- Advertisement -