కేటీఆర్…గొప్పనాయకుడు: కొండూరి రవీందర్ రావు

97
ktr

ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న గొప్ప నాయకుడు మంత్రి కేటీఆర్ అన్నారు టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు. జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నలుగురు దివ్యాంగులకు తన సొంత ఖర్చులతో రూ.4 లక్షల విలువైన నాలుగు త్రీవీలర్‌ స్కూటర్లు సమకూర్చగా….వాటిని నలుగురికి అందజేశారు.

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ తానున్నానే భరోసా ఇస్తున్నారని తెలిపారు.దివ్యాంగులకు సొంత ఖర్చులతో మోటర్‌ సైకిళ్లను అందివ్వడం హర్షనీయమన్నారు. వాహనాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల తదితరులు పాల్గొన్నారు.