అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ సెంటర్స్‌: హరీష్ రావు

143
harishrao

అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ సెంటర్స్ ప్రారంభించనున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు.సిద్ధిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్-19 ల్యాబ్- కరోనా ఆర్టీపీసీఆర్ స్వాబ్ పరీక్షా కేంద్రాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీష్‌ రావు ప్రారంభించారు.

ప్రభుత్వం అన్నీ జిల్లాల్లో కూడా ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ప్రారంభించనుందని తెలిపారు హరీష్ రావు. జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు లేక హైదరాబాదు నుంచి రావాల్సిన సమయంలో కొన్ని సందర్భాల్లో ఫలితాలకు ఆలస్యం జరిగేది. ఆ రెండు, మూడు రోజుల్లోనే కరోనా రోగి ఆరోగ్యం క్షిణించి.., వ్యాధి వ్యాప్తి జరిగి నిర్ధారణ రాకముందే కరోనా సోకిన వ్యక్తి నుంచి మరికొంత మందికి కరోనా సోకేదన్నారు.

ఇవాళ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధి ములుగులోని ఆర్వీఏంలో కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. ఐసీఏంఆర్ నుంచి అనుమతి రావాల్సి ఉన్నదని.., అనుమతి రాగానే త్వరలోనే సిద్ధిపేట వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించనున్నాం అన్నారు. ఆధునాతన వసతులతో గజ్వేల్, మెదక్ జిల్లాలోని 50 కిలో మీటర్ల పరిధిలోని చుట్టూ పక్కల గ్రామాల్లోని ప్రజలు వచ్చి ఆర్వీఏంలో కరోనా టెస్టులు ఉచితంగా చేయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కోవిడ్ రోగులకు ఆర్వీఏం ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి అందుబాటులో ఉన్నదని చాలా వసతులను ఉచితంగా అందిస్తున్నారు. కరోనా రోగులను కోరేది ఎవరు కూడా కార్పొరేట్ ఆసుపత్రిల్లోకి వెళ్లొద్దు. లక్షలు ఖర్చు చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.ఇప్పుడు జిల్లాలో ర్యాపిడ్ టెస్టులకు ఐదు వేల కిట్లు అందుబాటులో ఉన్నాయి.అన్నీ పీహెచ్ సీ కేంద్రాలలో ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి రిజల్ట్స్ ఇస్తాం అన్నారు.కరోన అనేది మనిషి చనిపోయే పెద్ద రోగం కాదు. కఆ లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలి.

  • కరోనా అంటే మానసిక ధైర్యం కావాలి. నిర్లక్ష్యం చేస్తే కరోనా ప్రాణాలు తీసుకుంటుందని, కరోనా అంటే ఆత్మ విశ్వాసం, ధైర్యంగా ఉండాలని ప్రజలకు విశ్వాసం కలిగించేలా పిలుపునిచ్చారు. కరోనా రోగులకే కాదు., ప్రాణాలకు తెగించి కరోనా రోగులను కాపాడుతున్న వైద్యులకు, నర్సులకు అందరికీ కూడా ప్రభుత్వం రక్షణగా ఉంటుందన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో మాట్లాడి రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు కూడా జిల్లాలో అందుబాటులో పెట్టాలని కోరినట్లు, ఈ సాయంత్రంలోపు 200 మందికి సరిపడే రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు సిద్ధిపేట డీఏంహెచ్ఓకు అందిస్తామని తెలిపినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క పేషేంట్ కు ఆరు డోజ్ లు అంటే రూ.25, రూ.26 వేల రూపాయలతో కూడిన కిట్లను ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తున్నాం అన్నారు.