రివ్యూ: కొండపొలం

580
kondapolam
- Advertisement -

క్రిష్ దర్శకత్వంలో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన గ్రామీణ యాక్షన్ డ్రామా “కొండపొలం”.ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, సాయిబాబు, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రమోషన్‌లో విడుదల చేసిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌రాగా భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరీ ఆ అంచనాలకు తగ్గట్టుగా కొండపొలంతో వైష్ణవ్ తేజ్ ప్రేక్షకులను మెప్పించాడా లేదా చూద్దాం..

కథ:

కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. నగరంలో బతకలేక తన పల్లెకు వెళ్ళినప్పుడు తాత సలహాతో కరువు కారణంగా అల్లల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొందరు ‘కొండపొలం’ చేస్తున్నారని, తమ గొర్రెలనూ తీసుకుని వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు. దీంతో నెల రోజుల పాటు అడవిలో ఉన్న రవీంద్ర తర్వాత ఏం చేశారు…?జీవితంలో ఎదురైన కష్టాలను ఏ విధంగా ఎదుర్కొన్నాడు అన్నదే కొండపొలం కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,అడవి నేపథ్యం, మాటలు, కీరవాణి సంగీతం. రవీంద్ర పాత్రలో ఒదిగిపోయాడు వైష్ణవ్ తేజ్‌. తన రెండో సినిమానే అయినా చక్కని నటనతో ప్రేక్షకులను రంజింపచేశారు. ఇక ఓబులమ్మ పాత్రలో ఒదిగిపోయింది రకుల్. హీరో క్యారెక్టర్‌కు సమాన పాత్ర కావడంతో జీవించేసింది. ఇతర పాత్రలలో అంథోని, హేమ, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ మెప్పించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. సన్నపురెడ్డి అందించిన కథ, మాటలు సినిమాకే హైలైట్. కీరవాణి తన సంగీతంతో మెప్పించగా ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వం సూపర్బ్ కాగా నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

అడవి నేపథ్యంలో తెలుగులో చాలానే చిత్రాలు రాగా అందులో డిఫరెంట్ మూవీ కొండపొలం. కథ, మాటలు సినిమాకు హైలైట్‌గా నిలవగా ప్రతీ పాత్రకు ప్రాణం పోశారు క్రిష్. మనుషుల్లోనూ మానవత్వం దండిగా ఉంటుందని, పెంచుకునే పశువుల కోసం అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు ఉంటారని తాను ఎంచుకున్న పాయింట్‌ని చక్కగా చూపించారు క్రిష్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరూ చూడదగ్గ చిత్రం కొండపొలం.

విడుదల తేదీ: 08/10/2021
రేటింగ్:3/5
నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్
సంగీతం: కీరవాణి
నిర్మాత: రాజీవ్ రెడ్డి
దర్శకత్వం: క్రిష్

- Advertisement -