స్మశాన వాటికలో మొక్కలను నాటిన కోండపాక సర్పంచ్..

279
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రజలల్లో ,ప్రజాప్రతినిధులలో చైతన్యం తీసుకువస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం లోని కోండపాక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మశాన వాటికలో 200 మొక్కలు నాటారు సర్పంచ్ మాధురి రెడ్డి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామంలో పచ్చదనం పెంచడం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్మశాన వాటికలో పచ్చని వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో స్మశాన వాటిక ప్రాంగణంలో 200 మొక్కలు నాటడం జరిగింది వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటున్నాము అని తెలిపారు.

- Advertisement -