తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారంరోజున కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండగట్టు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం ఉదయం 9గంటలకు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు బయల్దేరుతారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కొడగట్టుకు చేరుకుంటారు. ఉదయం 9.40గంటలకు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కోనేరు పుష్కరిణి కొండలరాయుని గుట్ట సీతమ్మ వారి కన్నీటిధార భేతాళ స్వామి ఆలయంతో పాటు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు అధికారులతో సీఎం కేసీఆర్ జెఎన్టీయూలో సమీక్షంచనున్నారు. సమీక్ష ముగిసిన వెంటనే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం కేసీఆర్ పర్యటనపై జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా చొప్పదండి సుంకే రవిశంకర్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 14న కొండగట్టు పర్యటన ఉండగా…దానిని 15వ తేదీకి మార్చుకున్నారు. మంగళవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున…భక్తులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశ్యంతో వాయిదా వేసుకున్నట్టు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..