ఓ సినిమా వచ్చిన మొదటి ఆటతోనే సినిమా ఇలా ఉందనీ ,అలా ఉందనీ ,బాగోలేదని, పరవాలేదని రివ్యూలు రాసే వాళ్ళమీద మండిపడ్డాడు కోన వెంకట్. ఇటీవల విడుదలైన నీవెవరో సినిమా పై వచ్చిన రివ్యూలు దాదాపుగా అన్నీ తమ సినిమా పై దుష్ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు .
ఇటీవల జరిగిన నీవెవరో థాంక్యూ మీట్ లో మాట్లాడిన ఆయన ” ఈ సినిమాలో కథ నమ్మకం తోనే మొదలై, నమ్మకంతోనే ముగుస్తుంది. అలాగే మేం అందరం కూడా నమ్మకంతో పని చేశాం. ఈ సినిమా పూర్తయ్యేసరికి మా అందరికీ జాబ్ శాటిస్ ఫాక్షన్ దొరికింది. కానీ జేబు శాటిస్ ఫాక్షన్ ఇంకా రాలేదు. కొన్ని వందలమంది. వేళా గంటలు పని చేస్తే ఒక సినిమా వస్తుంది. కానీ పది రూపాయల పెన్నుతో సినిమా బాలేదని రాసిపారేస్తారు. అది మా కష్టాన్ని వృధా చేసినట్టే అవుతుందనే సంగతి ఎందుకర్థం కావట్లేదు. ఇది నా ఆక్రోశం కాదు, ఆవేదన “అంటూ తన మనోభావాల్ని వ్యక్తం చేసారు.
ఈ సినిమా హీరో ఆది మాట్లాడుతూ ” శ్రావణ శుక్రవారం విడుదల కారణంగా మొదటి రోజు అంతగా కలెక్షన్లు రాకపోయినా తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఫుల్ గా రన్ అవుతుంది. సినిమాకి వచ్చే వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే మా కర్తవ్యం . అది మేం వందశాతం పూర్తి చేశాం ” అని వివరించారు. ఏది ఏమైనా కేవలం రివ్యూలతో సినిమాని అంచనా వేయడం సమంజసం కాదని, అది ఆ సినిమా పై దుష్ప్రభావం చూపుతుందని చెప్పడానికి “నీవెవరో” ఒక ఉదాహరణగా చెప్పొచ్చు .