గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు..

21
MLA Rega Kantha Rao

ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తన జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని ఆకుపచ్చగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బూర్గంపాడు మండలంలో మొక్కలు నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో ప్రతి ఒక్కరిని హరితహారంలో భాగస్వాములను చేస్తూ ఇప్పటికే కొన్ని లక్షల మొక్కలు నాటించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.