తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వివాదం రాజుకుంది. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టారు రాజగోపాల్ రెడ్డి.
సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని, పర్మిట్ రూంలు ఉండొద్దని రాజగోపాల్ రెడ్డి కండిషన్స్ పెట్టారు. దీంతో టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లారు మద్యం వ్యాపారులు.
ఈ విషయంపై స్పందిస్తూ, రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదు, అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు జూపల్లి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై, ప్రభుత్వం అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
Also Read:తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్!

