త్వరలో బీజేపీలో చేరుతా: కోమటిరెడ్డి

26
rajagopal reddy

త్వరలో బీజేపీలో చేరుతానని వెల్లడించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ముందుగా చెప్పిన వ్యక్తిని నేనే… రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతానని వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానందే తుది నిర్ణయమని వెల్లడించారు.

అయితే తాను బీజేపీలో చేరినా తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడరని వెల్లడించారు. పిసిసి అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి పోటిలో ఉన్నారని వెల్లడించారు.