దేశంలో 24 గంటల్లో 20,036 కరోనా కేసులు

55
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదుకాగా 256 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,54,254 యాక్టివ్‌ కేసులుండగా 98,83,461 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 1,48,994 మంది కరోనాతో మృతి చెందారు. గత 24 గంటల్లో 23,181 మంది కరోనా నుండి కోలుకున్నారు.