సీఎం రేవంత్‌కు కోమటిరెడ్డి కౌంటర్!

11
- Advertisement -

పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నేరుగానే విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

రెండు రోజుల క్రితం నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా… సోషల్ మీడియాను అవహేళన చేస్తూ తీవ్రంగా ఆరోపణలు విమర్శలు చేసిన ముఖ్యమంత్రికి కౌంటర్ గా స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

తాజాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ తన X ఖాతాలో రాజగోపాల్ రెడ్డి పెట్టిన మెసేజ్ యథాతథంగా…. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు.

Also Read:తెలంగాణ కేబినెట్ సమావేశం..

- Advertisement -