రాష్ట్రంలో నిధుల పంపిణీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే అన్ని నిధులు వెళ్లిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజుల్లో నిధులు ఇస్తానని చెప్పి మూడు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధుల విషయమై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అడిగితే, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని ఆయన చెప్పారని కోమటిరెడ్డి వెల్లడించారు. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ వంటి నియోజకవర్గాలకే నిధులు మళ్లుతున్నాయని విమర్శించారు. తమ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేస్తున్నారని చెప్పారు.
ఇలా నిర్లక్ష్యం కొనసాగితే ఎప్పుడో ఒక రోజు “బాంబు పేల్చక తప్పదు” అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. ఎదురు చూసి చూసి విసిగిపోయానని, అవసరమైతే ఏదో ఒక రోజు బాంబు పేలుస్తానంటూ ప్రభుత్వాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
Also Read:విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

