గజినీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సూర్య…అనతి కాలంలో తెలుగులో క్రేజ్ తెచ్చున్నారు. గజినీతో తన తెలుగు మార్కెట్‌లో స్థానంను సుస్థిరపరుచుకొని యముడు సింగం సిరీస్ సినిమాల ద్వారా మరింత చేరువయ్యారు. ఇక అప్పటి నుంచి ఈయన నటించిన సినిమాలన్నీ తమిళంతో పాటుగా తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సూర్య42.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సూర్య42పై అభిమానులు అంచనాలను అందుకోలేకపోతుందని కోలీవుడ్‌లో టాక్. దీంతో సూర్య ఈ సినిమా పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనికి సంబంధించి ఒక తాజా ఆప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమాకు వీర్ అనే టైటిల్ పెట్టినట్టు… ఈపేరును నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు వినిపిస్తోంది. అయితే ఈ నెట్టింట ఈ టైటిల్‌కు సంబంధించి అభిమానులు సంతృప్తిగా లేరని టాక్. దాదాపు రూ.200కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను 10భాషల్లో మరియు 3డీలో తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులోసూర్యకు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ జోడీగా కనిపించనుంది.
ఇవి కూడా చదవండి…
గ్రాండ్ గా ధమాకా 101 CR
కన్నీటి పర్యంతమైన సమంత…
గీతా ఫిల్మ్ .. ‘రైటర్ పద్మభూషణ్’