RAJINI:కోలీవుడ్‌కి ఇది మాస్టర్ పీస్‌..రజనీ

38
- Advertisement -

విసారణైవ, అసురన్, వడ చెన్నై వంటి విభిన్నమైన సినిమాలతో తనదైన మార్క్‌లో తెరకెక్కించే డైరెక్టర్ వెట్రిమారన్‌. గత నెల 31న విడుదలైన విడుదలై సినిమా కోలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో సూపర్‌ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌ వారు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలుగులో కూడా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇటీవలే చెన్నైలో జరిగిన థ్యాంక్స్ టూమీట్‌లో కోలీవుడ్‌ ప్రముఖులు పాల్గొని సినిమాపై తమ తమ అభిప్రాయాలను తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ సినిమాను మాస్టర్‌ పీస్‌గా అభివర్ణించారు. రజనీకాంత్‌ ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా అద్భుతమైన కథతో రూపొందింది. కోలీవుడ్‌ ఇండస్ట్రీలో గతంలో ఎవరూ ఇటువంటి సినిమాని చూసి ఉండరు. ఈ ప్రాజెక్ట్‌ ఓ మాస్టర్‌ పీస్‌గా చెప్పవచ్చు. అంతేకాదు సూరి నటన చాలా బాగుంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం రారాజు అని అన్నారు. ఈ సినిమాను ఇండస్ట్రీకే గొప్ప గర్వకారణమన్నారు. నిర్మాతలకు నా హృదయాపూర్వక ధన్యవాదాలు అని, అలాగే నేను రెండో పార్ట్‌ కోసం ఈగర్లీ వెయిటింగ్‌ అని అన్నారు. జయమోహన్ రాసిన షార్ట్ స్టోరీ విడుదలై ఆధారంగా చేసుకునే వెట్రిమారన్ సినిమాను తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి…

విడుదలై కోసం మట్టిముద్దగా నిల్చున్న :విజయ్‌సేతుపతి

ఏప్రిల్ 15న కమెడియన్ సూరి సినిమా విడుదల..

జీడీ నాయుడిగా మ్యాడీ…!

- Advertisement -