గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన కోలేటి దామోదర్..

511
haritha haram
- Advertisement -

ఈ రోజు ఉదయం రామగుండం గోదావరిఖనిలోని తెలంగాణ రాష్ట్ర పో లీస్ హౌసింగ్ కార్పోరేషన్‌ చెైర్మన్ కోలేటి దామోదర్ తన ఇంటి ఆవర్ణలో “హరితహారం” కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో దామోదర్ కుటుంబ సభ్యులతో పాటు, పుర ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ రూపొందించిన “గ్రీన్‌ ఛాలెంజ్‌” మంచి ప్రాచూర్యంపొందిందని ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం తన నుంచి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ దేవసేన, సింగరేణి కాలరీస్‌ డెైరెక్టర్ చందరశేఖర్ ఎంతో ఉతాసహంగా ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీరకరించారని దామోదర్‌ పేర్కొన్నారు.

Kolleti Damodar

భావితరాలకు ఆరోగ్య కరమైన వాతావరణాన్ని అందించాలనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో అధికారులు, నాయకులు అందరి భాగస్వామ్యంతో 3 కొట్లకు మొక్కలు నాటే కార్యక్రమం చేరుకుంది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కీసర గుట్టపై చేపట్టిన కార్యక్రమాన్ని దామోదర్ అభినందించారు.

గ్రీన్‌ ఛాలెంజ్‌ ఇచ్చిన వారు మొక్కలను నాటడంతో పాటు ఈ ఛాలెంజ్‌ని మరో ముగ్గురికి ఇవ్వవసి ఉంటుంది. ఈ పరంపర ఈ విధంగా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రమంతా హరితవనంగా రూపొంది, సీఎం హిరిత తెలంగాణ లక్ష్యం నెరవేరుతుందని దామోదర్‌ అన్నారు.

- Advertisement -