సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం..

76
mla harshavardhan reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి సాధ్యమైందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమశిల- సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి సాధించి సోమశిల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూల‌మాల‌లు, బాణ సంచాతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా నది తీరాన కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంత‌రం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి బ్రిడ్జి, జాతీయ రహదారి సాదించామన్నారు. నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కొల్లాపూర్ ప్రాంతవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణంతో పాటు జాతీయ రహదారిగా ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ పోతుగంటి రాములు దృష్టికి తీసుకువెళ్లి సాధించినట్లు తెలిపారు. సోమశిల వంతెన నిర్మాణంతోనే కొల్లాపూర్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.