24 గంటల్లో 16 కరోనా మరణాలు..

37
ap corona

ఏపీలో కరోనా ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16 కరోనా మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,524కి పెరిగింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 631, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 66 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 3,723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 76,726 నమూనాలు పరీక్షించగా 3,620 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,96,919 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,58,138 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా, 32,257 మంది చికిత్స పొందుతున్నారు.