కోల్‌కతా సెట్ లో మెగా సాంగ్

20
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న ‘భోళా శంకర్’ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. మెగాస్టార్ ప్రస్తుతం మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈరోజు భోళా శంకర్ తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సాంగ్ భోళా శంకర్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ లో పలు యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సీన్స్ లో మెగాస్టార్ మాస్ ఎలివేషన్లు హైలైట్ గా ఉంటాయట. ఎలాగూ దర్శకుడు మెహర్ రమేష్ కి మాస్ ఎలివేషన్లు బాగా హ్యాండిల్ చేస్తాడని మంచి పేరు ఉంది. పైగా ఇలాంటి మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు.

అందుకే.. కేవలం ఈ మాస్ ఎలివేషన్ల కోసేమే ఈ సినిమా తమిళ సినిమా రీమేక్ అయినప్పటికీ.. రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలను ఈ చిత్రంలో జోడించబోతున్నారు. స్వతహాగా యాక్షన్ కంటెంట్ ఎక్కువ రాసే ఒకరి ఇద్దరు రైటర్స్ కూడా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. మరి ఈ భోళా శంకర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ కి అయితే సెంటిమెంట్ ట్రీట్ తో పాటు మాస్ ట్రీట్ ఉంటుందని క్లారిటీ వచ్చింది.

ఇవి కూడా చదవండి…

బింబిసార-2.. ఎప్పుడంటే

రవీంద్ర కౌశిక్‌…ది బ్లాక్ టైగర్‌ బయోపిక్

శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్‌ బయోగ్రఫీ

- Advertisement -