మహేష్‌ న్యూ లుక్‌ అదిరింది..

231
Mahesh's new look out

ప్రిన్స్‌ మహేష్‌ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న లుక్ విష‌యంలో పెద్ద‌గా మార్పు చూపించ‌లేదు. కానీ మ‌హేష్ త‌న 25వ చిత్రంలో మాత్రం స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. భారీ గ‌డ్డం, మీసాల‌తో క‌నిపించ‌నున్నాడ‌ని పుకార్లు షికారు చేశాయి. ఈ క్ర‌మంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌త ఇటీవ‌ల‌ పోస్ట్ చేసిన ఫోటో వీటికి మ‌రింత బ‌లం చేకూర్చింది. ఇక భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత ఫ్యామిలీతో విదేశాల‌కి వెళ్ళిన మ‌హేష్ రీసెంట్‌గా ఇండియాకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో మ‌హేష్‌ని త‌మ కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫ‌ర్స్.

Mahesh Babu

ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట పడిన సూపర్ స్టార్ కూల్ గా బియర్డ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. గెడ్డం లుక్ లో మహేష్ నిజంగా పిచ్చెక్కిస్తున్నాడనే చెప్పాలి. గ‌తంలో ఎప్పుడూ క‌నిపించ‌ని లుక్‌లో మ‌హేష్ క‌నిపించడంతో ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోతున్నారు.

క్లీన్ షేవ్‌తో కనిపించే మహేష్ మొదటి సారి గెడ్డం లుక్ తో దర్శమిచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. మొత్తానికి కొత్త లుక్‌లో షాక్ ఇచ్చిన మహేష్ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి. వంశీ ప్రాజెక్టును దిల్ రాజు – అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.