వార్మప్‌లో టీమిండియా గెలుపు..

163
Kohli's men win via D/L method
Kohli's men win via D/L method
- Advertisement -

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి సన్నద్ధమయ్యేందుకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇంగ్లండ్ లో అడుగుపెట్టిన అనంతరం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు రోంచి (66), నీషమ్ (46) రాణించడంతో 34.4 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగుల‌ు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ ను టీమిండియా బౌల‌ర్ల‌ు ష‌మీ, భువ‌నేశ్వ‌ర్‌, జడేజా కట్టడి చేశారు. డ/లూ పద్ధతిలో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేనకు వర్షం అంతరాయం కలిగించింది. కోహ్లి (52 నాటౌట్‌; 55 బంతుల్లో 6×4), ధావన్‌ (40; 59 బంతుల్లో 5×4) రాణించడంతో ఛేదనలో భారత్‌ 26 ఓవర్లలో 129/3తో లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న దశలో వర్షం వల్ల మ్యాచ్‌ నిలిచిపోయింది. తిరిగి ఆటను కొనసాగించే వీలు లేకపోవడంతో డ/లూ ప్రకారం భారత్‌ను విజేతగా నిర్ణయించారు. యువరాజ్‌, రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. భారత్‌ తన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది.

- Advertisement -