ఆశలన్ని కోహ్లి పైనే….

205
virat
- Advertisement -

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ విధించిన స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ తడబడింది. అయితే క్రీజులో కోహ్లీ ఉండటంతో భారత్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. 194 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మూడో రోజు ఆట ముగిసేసమయానికి 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కోహ్లికి దినేశ్‌ కార్తీక్‌ (18 బ్యాటింగ్‌) అండగా ఉన్నాడు. విజయానికి భారత్ ఇంకా 84 పరుగుల  దూరంలో నిలిచింది.

కోహ్లీ లేకుంటే భారత్ ఆశలు మూడోరోజే ముగిసేవే. ఇంగ్లాండ్ పేస్ త్రయం ధాటికి విజయ్‌, ధావన్‌, రాహుల్‌, రహానె, అశ్విన్‌ క్యూ కట్టేశారు. దృఢ సంకల్పంతో క్రీజులో ఉన్న విరాట్‌ ఇంగ్లీష్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్(43 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండటం ఒక్కటే భారత్ బలం.

అంతకముందు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు అశ్విన్,ఇషాంత్ చుక్కలు చూపించారు. ఇషాంత్‌ పేస్ బౌలింగ్‌తో చెలరేగగా అశ్విన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. ఇషాంత్‌ (5/51), అశ్విన్‌ (3/59) వికెట్లు తీశారు. వీరి ధాటికి ఒకానొక దశలో 87 పరుగులకే 7 వికెట్లు కొల్పోయింది. అయితే కరన్ 63 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్ 180 పరుగులు చేయగలిగింది.

- Advertisement -