కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా:మోడీ

257
kohli
- Advertisement -

కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఓ సరికొత్త ఛాలెంజ్‌ను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘హమ్‌ ఫిట్‌తో ఫిట్‌ ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. రాథోడ్ విసిరిన ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఆయన విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన కోహ్లీ దానిని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ట్యాగ్ చేశారు. దీనికి మోడీ సైతం రిప్లై ఇచ్చారు.

కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్‌ని తాను స్వీకరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్‌లో తెలిపారు. చాలెంజ్ ని అంగీకరిస్తున్నా విరాట్. త్వరలోనే నా సొంత వీడియోను షేర్ చేసుకుంటా అని ఆయన పేర్కొన్నారు.

ప్రతీ ఒక్కరూ ఫిట్‌నెస్‌ మంత్రలో పాల్గొనాలని ఇందుకు సంబంధించిన వీడియోని రాథోడ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే మీ మిత్రులకు చాలెంజ్‌ చేయండి. నేను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌, బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌లకు సవాల్‌ విసురుతున్నాను’ అని ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సహా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

- Advertisement -