29న రజనీ..కాలా ప్రీరిలీజ్

174
Kaala pre Release On May29th

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. రజినీకాంత్ అల్లుడు ధనుష్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. కబాలిలో కొత్త రజినీకాంత్ చూపించిన దర్శకుడు రంజిత్.. ఈ సినిమలో కూడా తలైవాను డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజా ప్రీరిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

మే 29న హైదరాబాద్ నోవాటెల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను కన్నులపండువగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్లీ రిలీజ్ వేడుక ప్రారంభం కానుంది. అయితే, ప్రీ రిలీజ్‌ వేడుకకు ఎవరు అతిథిగా వస్తారన్నది సస్పెన్స్‌గా ఉంచింది చిత్రయూనిట్.

ఇటీవలె ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్‌. ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుంచే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో సూపర్ స్టార్ స్టామినా ఎంటో మరోసారి రుజువు చేశారు తలైవా. ఇంతకుముందు రజనీ చేసిన మాఫియా లీడర్ పాత్రే అయినప్పటికీ, పూర్తి డిఫరెంట్ గా ఈ పాత్రను మలిచాడని టాక్‌. ఓవరాల్‌గా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం విడుదల తర్వాత సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

kaala