ఆసీస్‌తో మూడో టెస్టు…భారత జట్టు ఇదే

61
bcci

ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టుకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్,ఆసీస్‌ చెరో మ్యాచ్‌ గెలవగా కీలకమైన మూడో టెస్టు జనవరి 7 నుండి సిడ్నీ వేదికగా జరగనుంది.

రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగనుంది. గాయ‌ప‌డిన ఉమేష్ యాద‌వ్ స్థానంలో న‌వ్‌దీప్ సైనీ టెస్ట్ అరంగేట్రం చేయ‌నుండ‌గా.. మ‌యాంక్ అగ‌ర్వాల్ స్థానంలో రోహిత్ శ‌ర్మ టీమ్‌లోకి వ‌చ్చాడు. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి రోహిత్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు.

భారత జట్టు: శుభ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ‌, పుజారా, ర‌హానే, విహారి, రిష‌బ్ పంత్‌, జ‌డేజా, బుమ్రా, సిరాజ్‌, సైనీ, అశ్విన్‌