మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో జూన్ 20 ఎంతో కీలకం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుకతో వారు తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ క్లీంకార ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను విడుదల చేశారు. యాదృచ్చికంగానే జరిగినప్పటికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులే అవుతుంది. గురువారం రోజునే ఉపాసన పుట్టినరోజు కావటం విశేషం. క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.
ఈ వీడియోలో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందదరిలోనూ ఎగ్జయిట్మెంట్, ఆనందం ఉండటాన్నిమనం గమనించవచ్చు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పండుగ చేసుకున్నారు. వాటన్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.
Also Read:మోడీపై మణిపూర్ ఎఫెక్ట్.. ఓటమి తప్పదా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ… క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయం కుదరటంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను అని చెప్పారు. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించిందన్నారు. అభిమానులు, ప్రేక్షకులు, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలపై చరణ్, ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read:ప్చ్.. 10 నిమిషాల్లోనే మార్చేశాడట