ఐపీఎల్ 13లో భాగంగా ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. దుబాయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రాహుల్ 36 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అతనికి 17వ అర్ధశతకం. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. రన్‌రేట్ 8కి తగ్గకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది.
ఇక ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా 2వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును రాహుల్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించడానికి టెండూల్కర్ 63 ఇన్నింగ్స్ తీసుకోగా.. రాహుల్ 60 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.