భారత స్టార్ బ్యాట్స్‌మన్ కె.ఎల్. రాహుల్ మరో మైలురాయిని చేరుకునే దిశగా ఉన్నారు. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు తరఫున 4000 పరుగులు పూర్తి చేయడానికి ఆయనకు కేవలం 15 పరుగులు మాత్రమే అవసరం. దక్షిణాఫ్రికాతో భారత్ ఈ నెల 14న తొలిటెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ 15 పరుగులు చేస్తే 4వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నారు.
33 ఏళ్ల రాహుల్ ఇప్పటివరకు భారత తరఫున 65 టెస్ట్ మ్యాచ్‌లలో 3,985 పరుగులు సాధించారు. ఈ ఘనతను సాధిస్తే, రాహుల్ టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు దాటిన 18వ భారత ఆటగాడుగా నిలుస్తారు.
Also Read:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!
భారత జట్టు చివరిసారి టెస్ట్ మ్యాచ్‌లు అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఆడింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు రెండు టెస్టుల్లోనూ సులభ విజయాలు సాధించింది. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా పైనా అదే విధమైన ప్రదర్శన ఇవ్వాలని భారత్ ఆశిస్తోంది.

