కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 14వ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానంలో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 20 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. కెప్టెన్ మోర్గాన్ 40 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మొదట పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, కమిన్స్, నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇయాన్ మోర్గాన్ (47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (41; 7 ఫోర్లు) రాణించారు.
స్కోరు బోర్డు..
పంజాబ్: రాహుల్ (సి) నరైన్ (బి) కమిన్స్ 19, మయాంక్ (సి) త్రిపాఠి (బి) నరైన్ 31, గేల్ (సి) కార్తీక్ (బి) మావి 0, హుడా (సి) మోర్గాన్ (బి) కృష్ణ 1, పూరన్ (బి) వరుణ్ 19, హెన్రిక్స్ (బి) నరైన్ 2, షారుక్ (సి) మోర్గాన్ (బి) కృష్ణ 13, జోర్డాన్ (బి) కృష్ణ 30, రవి (సి) మోర్గాన్ (బి) కమిన్స్ 1, షమీ (నాటౌట్) 1, అర్శ్‌దీప్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 123/9. వికెట్ల పతనం: 1-36, 2-38, 3-42, 4-60, 5-75, 6-79, 7-95, 8-98, 9-121, బౌలింగ్: 4-0-13-1, కమిన్స్ 3-0-31-2, నరైన్ 4-0-22-2, కృష్ణ 4-0-30-3, రస్సెల్ 1-0-2-0, వరుణ్ 4-0-24-1.
కోల్‌కతా: గిల్ (ఎల్బీ) షమీ 9, రాణా (సి) షారుక్ (బి) హెన్రిక్స్ 0, త్రిపాఠి (సి) షారుక్ (బి) హుడా 41, నరైన్ (సి) రవి (బి) అర్శ్‌దీప్ 0, మోర్గాన్ (నాటౌట్) 47, రస్సెల్ (రనౌట్) 10, కార్తీక్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 16.4 ఓవర్లలో 126/5. వికెట్ల పతనం: 1-5, 2-9, 3-17, 4-83, 5-98, బౌలింగ్: హెన్రిక్స్ 1-0-5-1, షమీ 4-0-25-1, అర్శ్‌దీప్ 2.4-0-27-1, రవి 4-0-19-0, జోర్డాన్ 3-0-24-0, హుడా 2-0-20-1.