కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టింది: కేకే

262
kk
- Advertisement -

ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ జరిపిన సమావేశం ముగిసింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఇబ్బంది పడాలా అని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు అన్నారు. రాష్ట్రానికి అవసరమున్న యూరియా కేంద్రం ఇవ్వలేదన్నారు. ప్రజా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను స్థానిక నేతలు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. తమతో వచ్చేవారితో కలిసి విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు.

సమస్యలపై రాజీ పడేది లేదన్నారు. జాతీయ రహదారుల విషయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలన్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోతారా? ప్రజలను మభ్యపెడతారా? అని అడిగారు. నవోదయ స్కూళ్ల గురించి ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఫలితం శూన్యం అన్నారు. జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటామన్నా ఆయన జీఎస్టీపై అన్ని పార్టీలను కలుపుకుని నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సమస్యలపై ఈ సమావేశాల్లో కేంద్రంపై పోరాడుతామని చెప్పారు. కృష్ణ నదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చడం లేదు.రాజ్యాంగబద్దంగా తెలంగాణకు రావాల్సిన నిధులు ,హామీలు నెరవేర్చడం లేదన్నారు.

- Advertisement -