కివీ పండ్లు ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఇందులో సి విటమిన్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల కివీ పండ్లను ప్రతిరోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా సీజనల్ గా వచ్చే వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా షుగర్ వ్యాధి గ్రస్తులకు కివీ పండ్లు అద్భుత వరం లాంటివి. ఎందుకంటే షుగర్ ను కంట్రోల్ చేసే గుణాలు ఈ పండులో అధికంగా ఉంటాయి. ఇంకా గుండె సంబంధిత రోగాలను దూరం చేయడంలో కివీ పండు ఎంతో ప్రయోజనకారి. అయితే వీటిని అధికంగా తింటే కూడా ప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కివీ పండ్లకు దూరంగా ఉండడమే మేలట. .
ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను ఏమాత్రం తినకూడదు. ఇందులో సిట్రిక్ ఆమ్లం మరియు పొటాషియం అధిక మోతాదులో ఉండడం వల్ల కిడ్నీల పనితీరు మరింత దెబ్బ తింటుంది. ఇంకా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా కివీ పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి ఎసిడిటీ తీవ్రతను మరింత పెంచుతుంది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా కివీ పండ్లను ఎక్కువగా తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే చర్మంపై దద్దుర్లు, ఎసిడిటీ, వంటి సమస్యలు ఉత్పన్నమవడంతో పాటు వాంతులకు కూడా కారణమవుతుంది. ఇంకా కొంత మందిలో మైకం విరోచనలకు కూడా కారణమవుతాయి. కాబట్టి కివీ పండ్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటిని మితంగానే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read:Mahesh:మహేష్ రు’బాబు’.. కిక్కివ్వాట్లేదా?