కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి…ప్రమాణస్వీకారం

375
bjp kishan reddy
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు హోంశాఖ సహాయమంత్రిత్వ శాఖను కేటాయిస్తారని సమాచారం. బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన అయినా అంచెలంచెలుగా జాతీయ స్ధాయి నేతగా ఎదిగారు.

1964, మే 15న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో జన్మించారు గంగపురం కిషన్ రెడ్డి. ఏబీవీపీ,ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేవైఎం బలోపేతానికి కృషిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షడిగా ఎన్నికయ్యారు.

2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2009, 2014లో అంబర్ పేట నుంచి గెలిచారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, బీజేపీ రాక్ష అధ్యక్షడిగా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సునామీ ముందు ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు.

- Advertisement -