కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… వెబ్ సైట్ హ్యాక్

152
kishan reddy

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి హ్యాకర్లు షాకిచ్చారు. ఆయన పర్సనల్ వెబ్‌సైట్‌ను పాకిస్దాన్‌కు చెందిన దుండగులు స్వాతంత్ర్య దినోత్సవం రోజున హ్యాక్ చేశారు. ఈ వెబ్‌ సైట్‌ను స్ధానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఉపయోగిస్తున్నారు కిషన్ రెడ్డి.

డే పాకిస్తాన్‌.. హ్యాక్డ్‌ బై మిస్టర్‌ హెచ్‌ఏకే.. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని శీర్షికగా రాశారు. మా కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్‌..అంటూ భారతదేశాన్ని దూషించారు. కశ్మీర్‌ను విముక్తి చేయండి.. మేం యుద్ధానికి సిద్ధం.. ఫిబ్రవరి 27 గుర్తుంచుకోండి అంటూ రాశారు.వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.