మొక్కలునాటిన కల్వరి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్

403
gic

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను మంచిర్యాల జిల్లాలోని సోమగూడెం, బెల్లంపల్లి రాష్ట్రీయ రహదారి మద్యలో కల్వరి మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్, కల్వరి ఫౌండేషన్ చైర్మన్ సిస్టర్ షారోన్ స్వీకరించారు. కల్వరి మినిస్ట్రీస్ ఆవరణలో మొక్కలను నాటారు.

పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్తినేని రవి కుమార్, కల్వరి నిర్వాహుకులు శ్రీనివాస్, పాస్టర్ కుమారుడు అభిషేక్, కుమార్తె అక్షయ, సభ్యులు ప్రసాద్ పాల్గొన్నారు.