రాజకీయాలకు అతీతంగా గ్రేటర్ అభివృద్ధి:కిషన్ రెడ్డి

80
kishan reddy

అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా సహకరించుకోవాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మంత్రి కేటీఆర్‌తో కలిసి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఆయన…ఆర్టీసీ x రోడ్ ట్రాఫిక్ సమస్య చాలా కాలం నుండి ఉందన్నారు.

అప్పటినుండి ఇక్కడ ఫ్లైఓవర్ రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.గతంలో భారీగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆర్టీసీ x రోడ్డు ఒకటి…ఫ్లై ఓవర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. హైదరాబాద్ నగరంలో జన సాంద్రత పెరిగి చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్లు ఫ్లైఓవర్ చాలా ముఖ్యమైనవి..నగరంలో పెట్టుబడిదారులు మరింతమంది రావాలి అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని….హైదరాబాద్ మహానగరంలో ఎస్ ఆర్ డి పి, సి ఆర్ ఎం పి, హెచ్ ఆర్ డి సి ఎల్ లా ద్వారా రోడ్ల డెవలప్‌మెంట్ చేపట్టామన్నారు.లాక్ డౌన్ సమయంలో నాలుగు రెట్లు వేగంగా రోడ్ల పనులు జరిగాయి…హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు… వివిధ ప్రాజెక్టుల రూపంలో పనులు చేపడుతున్నామని వెల్లడించారు.