Kiren Rijiju:న్యాయశాఖ బాధ్యతల నుండి తొలగింపు

38
- Advertisement -

కేంద్రమంత్రి కిరెన్ రిజుజు ను న్యాయశాఖ బాధ్యతల నుంచి తొలగించారు. నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ ఎంపికయ్యారు.స్వతంత్ర హోదాతో అర్జున్ రామ్ మేఘవాల్ కు న్యాయశాఖ బాధ్యతలు ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ.కిరెన్ రిజుజుకు భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కేటాయించారు.

రాష్ట్రపతి భవన్ ఈ విషయంపై గురువారం ప్రకటన విడుదల చేసింది.కిరణ్ రిజిజును న్యాయశాఖ నుండి తొలగించడంపై శివసేన స్పందించింది. పేర్లు ప్రస్తావించకుండా ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుల గురించి ప్రస్తావించింది. ఈ కారణంగానే కిరణ్ ను న్యాయశాఖ నుండి తొలగించారా అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.

Also Read:కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకొనేందుకు రిజిజు నుండి న్యాయశాఖను తొలగించిందని కాంగ్రెస్ నేత అల్కా లాంబా అభిప్రాయపడ్డారు.

- Advertisement -